ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే ఆరు నెలలకే అంత పని చేసింది .. ఇప్పుడు అంతకు బరితెగించింది గా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ప్రేమలు , పెళ్లిళ్లు విడాకులు ఇప్పుడు ఎంతో కామన్ గా మారిపోయాయి .. కొందరు కలిసి నటించిన హీరో , హీరోయిన్లు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరికొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు .. ప్రస్తుతం ఈ విడాకుల తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .. ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ , ఏఆర్ రెహమాన్ , జయం రవి .. ఇలా చాలా మంది స్టార్ లు విడాకులు తీసుకుంటూ తమ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అయితే కొంత మంది విడిపోయిన తర్వాత మళ్ళీ  పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. మరికొందరు ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా మారిపోతున్నారు. ఓ హీరోయిన్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది .. ఆ తర్వాత కేవలం 16 రోజులకే మనస్పర్ధలు వచ్చాయి కట్ చేస్తే ఆరు నెలలకే విడాకులు ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది.. ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నన ఎస్తర్ నోరోన్హా ... ఈ ముద్దుగుమ్మ తెలుగులో 1000 అబద్దాలు అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. తెలుగు , తమిళం , కన్నడ , మరాఠీ , హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను  మెప్పించింది. అయితే తెలుగులో 1000 అబద్దాలు సినిమా తర్వాత భీమవరం బుల్లోడు , గరం , జయ జానకి నాయక , జూలియట్ లవర్ అఫ్ ఇడియట్ , 69 సంస్కార కాలనీ, చాంగురే బంగారు రాజా, డెవిల్ టెనెంట్ , ఆదిపర్వం వంటి పలు సినిమాల్లో నటించింది.

ఈ హీరోయిన్ తెలుగులో రాప్ సింగర్, నటుడు నోయాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019 జనవరి 3న నోయల్ , ఎస్తేర్ పెళ్లి జరిగింది. తర్వాత కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో జూన్ 2019 లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత నోయల్ ,  ఎస్తర్ నోరోన్హా తమ సినిమాలతో బిజీ అయిపోయారు .. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్తేర్ రెగ్యులర్గా తన హాట్ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ హాట్ అభిమానులకు హ‌ట్‌నెస్‌కు కేర్ ఆఫ్ గా మారిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: