నాగచైతన్య-శోభిత పెళ్లికి రిటర్న్ గిఫ్ట్లు గా ఏం ఇస్తున్నారో తెలుసా..? అక్కినేని ఫ్యామిలీ నా మజాకా..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో పెళ్లి ఎంత పవిత్రంగా చేసుకున్నామా..? అని చూడడం కంటే కూడా పెళ్లి ఎంత గ్రాండ్గా .. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి చేసుకున్నామా..? ఎలాంటి ఆడంబరాలు చేసామా ..? అన్నదే హైలైట్ గా చేస్తున్నారు జనాలు.  డబ్బు ఉన్న డబ్బు లేకపోయినా స్టార్ సెలబ్రిటీస్ అయినా కామన్ పీపుల్స్ అయినా ఎక్కువగా పెళ్లిని హైలెట్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ..కాస్ట్లీ కాస్ట్లీ ఇంటీరియర్ డిజైనర్స్ .. పెళ్లి మండపం డెకరేషన్స్ ..మరీ ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇలా వీటి పైన ఫోకస్ చేస్తూ వస్తున్నారు .


కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాల పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.  రీసెంట్ గానే నాగచైతన్య - శోభిత  ధూళిపాల హల్దీ వేడుకలను కూడా జరుపుకున్నారు. దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . పట్టు వస్త్రాలలో చాలా చక్కగా చాలా ట్రెడిషనల్ గా శోభిత  అందరిని అట్రాక్ట్ చేసింది. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4వ తేదీ 8:13 నిమిషాలకు జరగబోతుంది . ఈ పెళ్ళికి దాదాపు 300 గెస్ట్లు హాజరు కాబోతున్నట్లు సమాచారం అందుతుంది .


చాలా సింపుల్ గా చాలా చాలా ట్రెడిషనల్ గా ఈ పెళ్ళి జరిపించబోతున్నారట ఫ్యామిలీ మెంబర్స్. అంతేకాదు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా పట్టుచీర పట్టు పంచ ఇవ్వబోతున్నారట. ఈ మధ్యకాలంలో రిటన్ గిఫ్ట్స్ అంటే కాస్ట్లీ వస్తువులే ఇస్తూ వస్తున్నారు . కొందరు బంగారు కాయిన్స్..మరికొందరు కాస్ట్లీ గ్లాస్ ఐటమ్స్ .. మరికొందరు ఇంకొన్ని..వాళ్ళకి  తగ్గ రేంజ్ లో ఇస్తున్నారు . కానీ శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ మాత్రం చాలా ట్రెడిషనల్ గా ఆలోచించిందట . మొదటి నుంచి తెలుగు సాంప్రదాయ ప్రకారం ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చిన జంటగా వచ్చిన ఇద్దరికీ బట్టలు పెట్టడం తెలుగింటి సాంప్రదాయం .అదే పద్ధతిని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్ళిలో చూపించబోతున్నారట శోభిత పేరెంట్స్.   పెళ్లికి హాజరు అయ్యే ప్రతి ఒక్కరికి పట్టు చీర పట్టు పంచే ఇవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: