సూపర్ స్టార్
రజినీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ...
రమ్యకృష్ణ ఈ
మూవీ లో రజనీ కాంత్
భార్య పాత్రలో నటించింది.
తమన్నా ,
సునీల్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక జైలర్ అనే టైటిల్ తోనే ఈ
మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయగా ఈ
మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్
సక్సెస్ అయ్యింది.
ఇక జైలర్ లాంటి బ్లాక్బస్టర్
సినిమా తర్వాత రజనీ కాంత్ లాల్ సలామ్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా రజనీ కాంత్ వెట్టయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంజు
వారియర్ ఈ సినిమాలో రజనీ కాంత్ కి
భార్య పాత్రలో నటించగా ... ఈ సినిమాకు టి జే జ్ఞానవెల్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ
మూవీ కి 10.96 కోట్ల షేర్ ... 21.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 18 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.
దానితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.04 కోట్ల మీద నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జైలర్
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకున్న
రజినీ కాంత్ ఆ తర్వాత లాల్ సలామ్ మూవీతో ఫ్లాప్ ను అందుకోగా , వెట్టయన్
మూవీ తో పర్వాలేదు అనే స్థాయి సక్సెస్ను మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది.