షాక్: అల్లు అర్జున్ పై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే..?

Divya
డిసెంబర్ 5వ తేదీన పుష్ప-2 రిలీజ్ పాన్ ఇండియా లెవెల్లో కాబోతున్న సమయంలో ప్రస్తుతం పలు రకాల ప్రమోషన్స్ అని పలు రకాల భాషలలో చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. సుకుమార్ ఈ సినిమాని చాలా గట్టిగానే ఈసారి ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా సరే తన ఫ్యాన్స్ బేస్ ని ఉపయోగించి అల్లు ఆర్మీ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. తనకు సపోర్ట్ అంతా వారే అంటూ తెలిపారు.అయితే ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ పైన ఒక పోలీస్ కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి పూర్తిగా చూద్దాం.

అల్లు అర్జున్ పై గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నిధులు వారు అల్లు అర్జున్ పైన పోలీస్ కేసు పెట్టినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్ మీద పెట్టుకున్నారని దీనిని చాలా తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది వీరు.. ఆర్మీ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారని ఆవేదనని వ్యక్తం చేశారు. ఈ విషయం పైన వెంటనే అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలంటే గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తెలియజేశారట.

మరి ఈ విషయం అల్లు అర్జున్ దాక వెళ్ళిందా లేదా తెలియదు కానీ అభిమానులు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నానారకంగా రచ్చ చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా తమ హీరో ఎదుగుతున్నారని తెలిసి కొంతమంది జలసిపడే ఇలాంటి పనులు చేస్తున్నారనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయం పైన అటు పోలీసులు ఎలా స్పందిస్తారు అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారని విషయం పైన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప-2 రిలీజ్ కి సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: