గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రాంచరణ్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. రాంచరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘ మగధీర ‘ అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయిన రాంచరణ్ కు రాజమౌళి తిరుగులేని విజయం అందించాడు..ఈ సినిమాతో రాంచరణ్ స్టార్ హీరో అయ్యారు.. అయితే ఆ తరువాత రాంచరణ్ ఎన్ని సినిమాలు తీసిన మగధీర రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు..రాంచరణ్ కెరీర్ లో మగధీర సినిమా తరువాత బాగా కష్టపడ్డ సినిమా బ్రూస్ లీ.. ది ఫైటర్.. ఈ సినిమాలోని ఫైట్స్ కోసం రాంచరణ్ ఎంతగానో కష్టపడ్డాడు.. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ సినిమాను తెరకెక్కించాడు ..రాంచరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.రాంచరణ్ ఈ సినిమాలో స్టంట్ కొరియోగ్రాఫర్ గా నటించాడు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..
ఈ సినిమాలో రాంచరణ్ తన పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు..
ఇదిలా ఉంటే అప్పటి వరకు రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించిన మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోరిక మేరకు మళ్ళీ సినిమాలలో నటించేందుకు సిద్ధం అయ్యారు..తన కెరీర్ లో ప్రెస్టేజియస్ 150 వ సినిమా కోసం సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ సినిమాలో అనూహ్య ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు..ఈ సినిమాలో మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోతుంది.. మెగాస్టార్ ఎంట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బిజిఎం ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది .. దాదాపు ఏడేళ్ల తరువాత మెగాస్టార్ స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోయారు..అయితే బ్రూస్ లీ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ మెగాస్టార్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ థియేటర్ కి క్యూ కట్టారు..దీనితో సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి కానీ సినిమా ప్రేక్షకులకి రొటీన్ మూవీగా అనిపించింది..