ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్ర ప్రసాద్.. కానీ?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపును సంపాదించుకుని ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటులలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. రాజేంద్ర ప్రసాద్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది. ఎలాంటి పాత్రలో నటించినా రాజేంద్ర ప్రసాద్ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. తాజాగా ఆయన మాట్లాడుతూ మూవీ ఆఫర్లు లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు.
 
చేతిలో డబ్బులు లేకపోవడంతో మూడు నెలల పాటు అన్నం తినలేదని ఆయన కామెంట్లు చేశారు. మా నాన్న స్కూల్ టీచర్ అని చాలా కఠినంగా ఉండేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బీటెక్ పూర్తైన వెంటనే సినిమాల్లోకి రావాలని నేను నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. అందుకు ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నాన్న నాతో నీ ఇష్టానికి వెళ్తున్నావని సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది నీకు సంబంధించిన విషయం అని చెప్పారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
 
ఒకవేళ ఫెయిలైతే ఇంటికి రావద్దని చెప్పారని ఆయన తెలిపారు. నాన్న మాటలు నాపై ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించానని రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. కాకపోతే అవకాశాలు మాత్రం రాలేదని ఆయన పేర్కొన్నారు. వేషాలు వచ్చేంత గ్లామర్ లేదని తెలుసని అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
 
నాన్న తిట్టడంతో బాధగా అనిపించి చనిపోవాలని అనుకున్నానని ఆయన తెలిపారు. నిర్మాత పుండరీక్షాక్షయ్య ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పి మద్రాస్ లో ఇల్లు కట్టించానని ఆయన తెలిపారు. ఆ తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం ఏర్పడిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
 
వంశీ సినిమాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నానని ఆయన తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఇతర నటీనటులకు భిన్నంగా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: