40 ఏళ్లు దాటినా..ఆ హీరోయిన్‌కు రాత్రి అయితే.. అది కావాల్సిందేనట..?
కానీ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో త్రిష హవా కాస్త తగ్గిపోయింది. యంగ్ హీరోయిన్స్ పరిచయం అవ్వడంతో త్రిషాను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత త్రిష మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన లియో సినిమాలోను త్రిష నటించింది. ఈ సినిమా సక్సెస్ తో త్రిష హవా పెరిగిపోయింది.
ప్రస్తుతం త్రిష చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారుతుంది. త్రిష రాత్రి సమయంలో కూడా మేకప్ లేకుండా అస్సలు పడుకోదట. ఎప్పుడూ కూడా త్రిష మేకప్ వేసుకునే ఉంటుందట. ఈ విషయం తెలిసి కొంతమంది మరి అంతగా మేకప్ వేసుకోవడం అవసరమా అంటూ నెగిటివ్గా టోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు.
40 పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ తన అందాలతో కట్టిపడేస్తోంది. త్రిష ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఇంకా సింగిల్గానే ఉంది. కొందరితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నప్పటికీ త్రిష మాత్రం ఆ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు. మరి త్రిష ఎప్పుడు వివాహం చేసుకుంటుందా అని తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.