ఎన్టీఆర్ " దేవర " ఫైనల్ కలెక్షన్స్ ఇవే.. మొత్తం ఎన్ని కోట్ల లాభం అంటే..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ 2024లో టాలీవుడ్ లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చి పెట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రూ.260 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దాదాపు రూ.184 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది. నిర్మాతలకు ఓవరాల్ గా రూ.74 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.240 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు.. రూ.162 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు దేవర సినిమా దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్సీస్ లో రూ.36 కోట్లు , హిందీలో రూ. 4 కోట్లు షేర్ .. దేవర సినిమా సొంతం చేసుకుంది.


అయితే తమిళనాడు, కేరళలో మాత్రం దేవర సినిమా నిరాశపరిచింది. కేరళలో దేవర సినిమా కేవలం కోటిలోపే వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా దేవర వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటుతుందని.. నిర్మాతలకు రూ.100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెడుతుందని అనుకున్నారు. అయితే మిక్స్డ్ టాక్ కారణంగా.. దేవర భారీ అంచనాలు అందుకోలేదు. ఈ సినిమాతోనే దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మాటకు వస్తే ఆమెకు సౌత్ ఇండియాలో తొలి సినిమా దేవర కావ‌టం విశేషం. దేవర కు కంటిన్యూస్‌గా తెరకెక్కి దేవర 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్రన్‌ సంగీతం అందించారు. ఇక దేవ‌ర సినిమాకు కంటిన్యూ గా దేవ‌ర 2 కూడా 2026 లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: