దానవీరశూరకర్ణ, లవకుశ సినిమాల తర్వాత .. ఆ రికార్డు పుష్పరాజుదే..!
తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక నిడివి గల సినిమాలలో మొదటి స్థానం దానవీరశూరకర్ణ ది .. మూడు గంటల 44 నిమిషాలతో ఈ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన దర్శకత్వానికి ప్రేక్షకులు నీరాజనం పెట్టారు. ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్ ఇచ్చారు .. ఈ సినిమా తర్వాత స్థానం లవకుశ ది .. ఈ సినిమా నిడివి మూడు గంటల 28 నిమిషాలు .. ఈ రెండు సినిమాలు కూడా నటరత్న ఎన్టీఆర్ వే కావటం, ఇండస్ట్రీ రికార్డులు సృష్టించినవి కావటం గమనార్హం.. ఇక ఇప్పుడు పుష్ప 2 మూడో ప్లేస్ లోకి రాబోతుంది .. మూడు గంటల 21 నిమిషాలతో తెలుగులో స్ట్రెయిట్ సినిమాల్లో ఒక అరుదైన ఘనత సాధించునుంది ఇప్పటి జనరేషన్ హీరోలో ఎవరో తీసుకోని అతిపెద్ద రిస్క్ కూడా ఇదే .
బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.. మేరా నామ్ జోకర్, ఎల్ఓసి కార్గిల్, లగాన్, సంగం, ఖతర్నాక్, హే రామ్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. తెలుగులో మాత్రం చాలా తక్కువ .. త్రిబుల్ ఆర్ సైతం మూడు గంటలు ఐదు నిమిషాలకే పరిమితం కావలసి వచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో సుకుమార్ ఇంత లెంగ్త్ పెట్టడం చిన్న విషయం కాదు.. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ సాధిస్తే మిగిలిన దర్శకులు కూడా దీన్నే ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది. ఎడిటింగ్ చేసేందుకు అవకాశం లేకుండా టైటిల్ నుంచి శుభం కార్డు దాకాఎడిటింగ్ చేసేందుకు అవకాశం లేకుండా టైటిల్ నుంచి శుభం కార్డు దాకా ఓర మాస్ కంటెంట్తో పుష్ప 2 ఏం మాత్రం బోరు కట్టకుండా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు గట్టి ధీమాగా ఉన్నారు .