సాఫ్ట్‏వేర్ ఇంజనీర్ టూ కాస్ట్యూమ్ డిజైనర్ .. ఇండస్ట్రీలో ఆమె ఎంతో స్పెషల్..!

Amruth kumar
రీసెంట్గా ప్రముఖ ఓటీటీ ఛానల్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెబ్ సిరీస్ వికటకవి సిరీస్ కు ఈమె వర్క్ చేశారు .. నరేష్ అగస్త్య , మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి వికటికవి వెబ్ సిరీస్ ను నిర్మించారు. నవంబర్ 28 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు పని చేసిన గాయత్రి దేవి మాట్లాడుతూ .. పుట్టింది విజయనగరం , పెరిగింది చెన్నై , ఇంటర్ వరకు చెన్నైలోనే ఉన్నాను కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను ..

 సాంసంగ్ లో జాబ్ చేశాను .. తర్వాత మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యాను ఆ సమయంలో నేను హైదరాబాద్ వచ్చాను. ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో డెవలపర్గా కూడా పనిచేశాను .. మూడేళ్లు హైదరాబాద్లో వర్క్ చేసిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో జాబ్ మానేశాను అని ఆమె అన్నారు. జాబ్ మానేస్తున్న తర్వాత బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను ఆ సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ లో జాయిన్ అయ్యాను.. ఇంట్లో కుట్లు అల్లికలు నేర్పించడం ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ పెట్టడానికి బాగుంటుందని నాకు అనిపించింది ..

40 ఏళ్లు వచ్చిన తర్వాత బోటిక్ బిజినెస్ పెడదామని అనుకునే దాన్ని.. అలాగే సంవత్సరం పాటు ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లమో  కూడా పూర్తి చేశాను .. ఇక ఆ కోర్స్ పూర్తివాగానే ఫ్యాషన్ షో కూడా చేశాను. రెగ్యులర్గా ఇతర డిజైనర్స్ నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకుని వెళుతూ ఉండేవారు .. అలా మొదలైన నా ప్రయాణంలో నేను కూడా మెల్లగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాను .. పలాస సినిమాకి నేను డిజైనింగ్ మాత్రమే చేసి ఇచ్చాను .. షూటింగ్ కు మాత్రం వెళ్ళలేదు .. అయితే అహలో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్ గా నా కెరియర్ మొదలైంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: