ధనుష్ తో ఎఫైర్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ .. ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు .. స్టార్ హీరోయిన్ అమలాపాల్ .. 'సింధు సమవెలి' సినిమాతో కోలీవుడ్లో అడుగు పెట్టిన ఈమెకు తొలి సినిమాతోనే మంచి పేరు కూడా వచ్చింది. తర్వాత మైనా సినిమాలు నటించింది .. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో వరుస అవకాశాలు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు జంటగా తలైవా సినిమాలో నటిస్తున్నప్పుడు దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తో ప్రేమలో పడింది అమలాపాల్ .. ఇక 2014 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది .. కానీ ఎ.ఎల్. విజయ్ తో కొన్ని మనస్పర్ధలు రావడంతో 2017 లో విడాకులు తీసుకున్నారు.
ఇక ఎ.ఎల్. విజయ్ తో విడిపోయిన తర్వాత ఆమె సినిమాలో బట్టలు లేకుండా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలాపాల్ .. ఆ తర్వాత తమిళ సినిమాల్లో అవకాశాలు కొంత తగ్గాయి .. 'బోలా', 'ఆడుజీవితం', 'లెవెల్ క్రాస్' వంటి పలు హిట్ సినిమాల్లో కూడా నటించింది. గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది అమలాపాల్ .. కానీ పెళ్లయిన ఎనిమిది నెలలకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది .. దీంతో పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది .. గత జూన్ లో అమల పాల్ కు కొడుకు జన్మించాడు. కుమారుడు పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న అమల పాల్ ప్రస్తుతం కుమారుడి పెంపకం లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది.