ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్.. సుకుమార్ కి ఫ్యాన్స్ వైల్డ్ విషెస్..ఏం చేసారో చూడండి..!

Thota Jaya Madhuri
సుకుమార్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిన విషయమే. ఒక సినిమాను తెరకెక్కించడం చాలామంది డైరెక్టర్ లు చేస్తూ ఉంటారు . కానీ జనాలకు నచ్చే కాన్సెప్ట్ ని తెరకెక్కించడం. ఆయన తెరకెక్కించే సినిమాలను జనాలు నచ్చేలా చూడడం సుకుమార్ స్పెషాలిటీ . ఆ విషయం అందరికీ తెలిసిందే . మరి కొద్ది రోజుల్లోనే పుష్ప2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సుకుమార్ ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు .


అంతేకాదు పుష్ప 2 సినిమాతో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైపోయాడు సుకుమార్.  ఫ్యాన్స్ కూడా సుకుమార్ పేరు అంతే హైలెట్ చేస్తూ వస్తున్నారు. కాగా ప్రతి సినిమాకి హీరో కర్త - కర్మ - క్రియగా చేస్తూ ఉంటారు . కానీ పుష్ప సినిమా విషయంలో మాత్రం అల్లు అర్జున్ కన్నా సుకుమార్ పేరు హైలెట్ గా మారింది. ఎంతలా అంటే సుకుమారే ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంటూ అల్లు అర్జున్ పలు సందర్భాలలో స్టేజి పైన చెప్పుకొచ్చారు. . నిన్నటికి నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్లో నా కెరియర్ ఇలా ఉండడానికి కారణం సుకుమార్ అంటూ ఇన్నేళ్ళ తన కష్టాన్ని అంతా కూడా సుకుమార్ ఖాతాలో వేసేసాడు .


పుష్ప2 మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతుందన్న మూమెంట్లో ఫాన్స్ వెరైటీగా విషెస్ అందించారు .  సుకుమార్ జీనియస్ డైరెక్టర్.  అంతేకాదు గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా .. తనౌ పేరు తెచ్చుకోవడమే కాకుండా తన అసిస్టెంట్ ల కి కూడా డైరెక్టర్గా మారే అవకాశాన్ని ఇస్తూ ఉంటారు .  రీసెంట్గా ఫ్యాన్స్ మచ్ అవైటెడ్ పుష్ప2 రిలీజ్ అవుతున్న సందర్భంగా  సుకుమార్ కు ఫ్యాన్స్ స్పెషల్ విషెస్ అందించారు . దాదాపు 750 బైక్స్ ని సుకుమార్ అనే పేరు వచ్చేలా క్రమంగా పేర్చి రాబోయే సినిమా గ్లోబల్ రేంజ్ లో హిట్ అవ్వాలి అంటూ వైల్డ్ విషెస్ చెబుతూ సుకుమార్ అంటే తమకు ఎంత ఇష్టం అన్న విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు.  దానికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి ఘనత అందుకున్న డైరెక్టర్ లేరు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ లెవెల్ లో విషెస్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కావడం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: