పుష్ప 1 VS పుష్ప 2... అప్పటకి... ఇప్పటకీ తేడా ఇదే... !
కాలం గిర్రున తిరిగి వచ్చేసింది. ఎప్పుడో పుష్ప వచ్చింది సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు మూడేళ్లు టైం అయిపోయింది. పుష్ప 2 పై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు టైం వేరు.. ఇప్పుడు వేరు.. అప్పుడు అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత పుష్ప 1 వచ్చి ఆ అంచనాలు సులువుగానే అందుకుంది. ఇప్పుడు పరిస్థితి వేరు.. పుష్ప 2 కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలతో థియేటర్ల లోకి దిగుతోంది.
బన్నీ ఇప్పుడు కేవలం టాలీవుడ్ లేదా సౌత్ ఇండియన్ స్టార్ మాత్రమే కాదు.. ఓ తిరుగులేని పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు పుష్ప 2 కు కేవలం ఏపీ , తెలంగాణ వరకు మాత్రమే చూసుకుంటే ఏకంగా రు. 212 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది మామూలు టార్గెట్ కాదు.. అంటే రు. 450 కోట్ల గ్రాస్ వసూళ్లు ఏపీ - తెలంగాణ నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. మారిన పరిస్థితుల్లో బన్నీ కి ఎంత క్రేజ్ పెరిగిందో .. ఇప్పుడు అంతకు మించిన వ్యతిరేకత కూడా పెరిగింది.
అటు ఓవర్సీస్ లో కూడా పరిస్థితులు పూర్తి గా మారిపోయాయి. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. బన్నీ అక్కడ కూడా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు పుష్ప 2 వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ రు. 1000 కోట్లు . ఆ లెక్క చూస్తేనే పుష్ప 2 ఇప్పుడు ఏ రేంజ్‌లో పెర్పామ్ చేయాలో మనకు అర్థమవుతోంది. మరి బన్నీ పెర్పామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ నెల 4నే తేలిపోనుంది.