నువ్వే కావాలి.. తరుణ్ ని ఇండస్ట్రీ లోకి హీరోగా పరిచయం చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. తరుణ్,రీచా పల్లాడ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే కావాలి సినిమా2000 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.ఈ సినిమా ఓ క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది.అంతేకాదు ఈ మూవీ 250 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్, రామోజీరావు నిర్మాతలుగా చేసిన నువ్వే కావాలి మూవీ అప్పటి తరం కుర్రాకారును ఎంతగా అట్రాక్ట్ చేసిందో చెప్పనక్కర్లేదు. అల్లరి చిల్లరగా తిరిగే స్నేహితులు ప్రేమికులుగా ఎలా మారారు అనే విషయాన్ని సినిమాలో చూపించారు. ఇక నువ్వే కావాలి సినిమా అప్పటి యూత్ ని ఎంతగానో ఆకర్షించింది. దాంతో తరుణ్ కి రీచా పల్లాడ్ కి మంచి గుర్తింపు లభించింది.
అయితే మొదటి సినిమా హిట్ అయినప్పటికీ కూడా రీచా పల్లాడ్ కి అంతగా అవకాశాలు అయితే రాలేదు. రీచా కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ,హిందీ, తమిళ భాషల్లో కూడా హీరోయిన్ గా చేసింది. అలా ఈమె తెలుగులో నా మనసిస్తారా, హోలీ,పెళ్ళాం పిచ్చోడు వంటి సినిమాల్లో చేసింది. అయితే ఎన్ని సినిమాల్లో చేసినా కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదు. ఇక 2016లో నుండి కొద్దికొద్దిగా సినిమాలకు దూరమైంది.కానీ 2020లో లాల్ ఇష్క్యూ అనే వెబ్ సిరీస్,యువర్ హానర్ అనే వెబ్ సిరీస్ లలో రీచా కనిపించింది. అయితే ఈమెకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి ఓ హీరోతో ఉన్న సాన్నిహిత్యమే అని అప్పట్లో టాక్ వినిపించింది.
ఆ హీరో తో ఎక్కువగా తిరగడం వల్లే మిగతా హీరోలు ఈమెను తీసుకోవడానికి ఇష్టపడలేదనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.కానీ ఇందులో ఉంది ఎంత నిజం అనేది మాత్రం తెలియదు.ఇక రీచా 2011లో హిమాన్షు బజాజ్ ని పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చింది. పెళ్లయ్యాక చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంది.ఇక 2020 లో ఓ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు మళ్ళీ ఏ సినిమాలో గానీ వెబ్ సిరీస్ లో గానీ కనిపించలేదు.అలా అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కేవలం కొన్ని సినిమాలకి మాత్రమే పరిమితమైంది