పులివెందుల వైసీపీ నేతల కార్ల వెనక ఇంత దందా ఉందా..?
పులివెందుల నియోజకవర్గం అంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆ మాటకు వస్తే గత నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల నియోజకవర్గంలో అస్సలు తిరుగులేదు. అయితే వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వైసిపి దందా ఒక రేంజ్ లో నడిచింది. చిన్న చిన్న చోటా మోటా నాయకులు కూడా ఏకంగా సీఎం రేంజ్ లో అధికార దర్పం ప్రదర్శించారు. తాజాగా ఇది బయటకు వచ్చింది హైదరాబాదు నుంచి కార్లు అద్దెకు పేరుతో తెచ్చుకుని తిరిగి ఇవ్వకపోవడం .. ఎవరైనా కారు మాదే అని వస్తే వారిని చితక బాదడం జరిగింది. తాజాగా పులివెందులకు వెళ్లిన తెలంగాణ పోలీసులు ఇలా కొట్టుకొచ్చిన ఆరు కారులను స్వాధీనం చేసుకుని తిరిగి యజమానులకు ఇచ్చారు. ఈ కార్లను తెచ్చుకుంది వైసిపి జడ్పిటిసి సభ్యులు ఇతర పదవుల్లో ఉన్నవారు కావడం గమనార్హం. వీరంతా ఎంపీ అవినాష్ రెడ్డికి దగ్గర మనుషులు అని సమాచారం.
సంగారెడ్డికి చెందిన సతీష్ అనే వ్యక్తి కార్లు అద్దెకు ఇస్తూ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ సతీష్ దగ్గర్నుంచి ఆరు కారులను అద్దెకు తీసుకొని వాటిని నేరుగా పులివెందులకు తీసుకువెళ్లిపోయారు. వైసీపీ వాళ్లు ఇది జరిగి మూడున్నర సంవత్సరాలు అవుతుంది .. కార్లు వెనక్కి ఇవ్వలేదు. అది కూడా ఇవ్వటం లేదని సతీష్ పోలీస్ కేసు పెట్టారు. అప్పట్లో దొంగలకే పోలీసుల సహకారం కాబట్టి కార్లను సతీష్ తెచ్చుకోలేకపోయారు.. కదా కొట్టించుకోవలసి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో తెలంగాణ పోలీసులను తీసుకువెళ్లి తమ కారులను తాము తెచ్చుకున్నారు. వైసీపీ నేతలు నిర్వాకం చూసి ఇలా అద్దె పేర్లతో కార్లు తెచ్చి సొంత కారులను వాడేసుకుంటున్న వైనం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు వాడే కార్లు వారివేనా లేకపోతే ఇలా తెచ్చుకున్నావా అని ఆరా తీస్తున్నారు.