గతేడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది క అంటూ డిఫరెంట్ మూవీతో మన ముందుకొచ్చాడు. పైగా అతని కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. సుజీత్, సందీప్ దర్శక ద్వయం తెరెక్కించిన ఈ విలేజ్ అండ్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లక్కీ భాస్కర్, అమరన్, బఘీరా వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన క సినిమా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇక కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా క నిలిచింది. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు కిరణ్ అబ్బవరం సినిమాను చూశారు. టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో నటించాడు. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఇదిలావుండగా ఇప్పుడు మారుతి, ఎస్ కే ఎన్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. మారుతి, ఎస్కేఎన్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. K- RAMP అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారినా.. అదే ఏ సినిమాకు టైటిల్ అన్న విషయం క్లారిటీ లేదు.ఈ క్రమంలో ఇప్పుడు దిల్ రుబా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కిరణ్ అబ్బవరం. నిజానికి క మూవీ కన్నా ముందే దిల్ రుబా రావాల్సి ఉంది. ఎందుకో ఏమో తెలియదు కానీ.. సినిమాను విడుదల కాలేదు. కొత్త డైరెక్టర్ విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఆ లవ్ ఎంటర్టైనర్ మూవీని ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే క మంచి సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు కెరీర్ ను సరైన రీతిలో నిలబెట్టుకునేందుకు ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.