పవన్ 'OG' సినిమాలో ప్రభాస్.. హిలేరియస్‌గా రియాక్ట్ అయిన మేకర్స్..??

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఓజీ’ 2025 సంవత్సరం రెండవ భాగంలో విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత చిత్రం ‘హరి హర వీరమల్లు’ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘ఓజీ’ సినిమా గురించి ఒక రూమర్ వైరల్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారనేది ఈ రూమర్ సారాంశం. దర్శకులు ప్రభాస్‌కు కథ చెప్పారని, ఆయన ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని కూడా ఈ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్త చూశాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు, కానీ ఈ ఉత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు. సినిమా యూనిట్ ఈ రూమర్‌లో నిజం లేదని స్పష్టం చేసింది.
OG సినిమా యూనిట్ తాజాగా ‘వెంకీ’ సినిమా నుంచి ఒక కామెడీ సన్నివేశాన్ని పంచుకుంది. అందులో "ఆ బొక్క జరిగిద్ది, అవన్నీ నమ్మావంటే నువ్వు కూడా నీ ఫేస్ లానే ఏదో ఒక కన్నాలు వేసుకొని బతకాలి, రా" అనే బ్రహ్మానందం రవితేజని ఆట పట్టించే వీడియో ఉంది. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త అవాస్తవమని స్పష్టమైంది. ఇదే మొదటిసారి కాదు, ‘ఓజీ’ సినిమా గురించి ఇలాంటి రూమర్స్ చాలా రోజులుగా వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, సినిమా యూనిట్ ఆ వార్తలో కూడా నిజం లేదని తెలిపింది.
‘ఓజీ’ సినిమాను డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా గురించి ఫ్రెష్ అప్‌డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగని ఈ క్రమంలో ఈ సినిమా గురించి వచ్చే వార్తలన్నీ నిజమే అనుకోవద్దని మేకర్స్ కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించక చాలా రోజులు అవుతుంది. త్వరలోనే మరోసారి తెరపై కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సినిమా అందరినీ కచ్చితంగా బాగా అలరిస్తుందని చెప్పుకోవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: