ఆ హీరోకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన నీహారిక.. మెగా డాటర్ దెబ్బ అదుర్స్..!?

Thota Jaya Madhuri
మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత ఎంత స్ట్రాంగ్ గా మారిపోయిందో అందరికీ తెలిసిందే.  అంతకు ముందు సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారికను బూతులతో ట్రోల్ చేసేవారు . కానీ విడాకుల తర్వాత మాత్రం నిహారిక స్థాయి ఇంకా హైలైట్ అయ్యేలా చేస్తుంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడానికి ట్రై చేస్తుంది . అంతేకాదు తన ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తుంది.  ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్న విషయాన్ని బాగా హైలైట్ చేస్తూ నిహారిక నలుగురికి   ఆదర్శప్రాయంగా నిలుస్తుంది .


అయితే నిహారికకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది.  నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఏ కారణం చేత విడాకులు ఇచ్చారు అన్న విషయం బయటకు రానప్పటికీ ..నిహారిక ఫాస్ట్ కల్చర్ జొన్నలగడ్డ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది అన్న కామెంట్స్ మాత్రమే ఎక్కువగా వినిపించాయి . అయితే నిహారిక కి జొన్నలగడ్డ చైతన్య కంటే ముందే కొందరు ప్రపోజ్ చేశారట.  వాళ్ళల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరో కూడా ఉన్నారట .


నిహారిక కి ఇంస్టాగ్రామ్ ద్వారా బాగా దగ్గరైన ఈ హీరో ఆమెకు మంచి ఫ్రెండ్ గా మారారట.  అయితే సడన్గా ఆమెకు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవాలి అంటూ బాగా బలవంతం చేశారట. నిహారికను చూసి ఫ్లాట్ అయిపోయాడో లేక మెగా ఇంటి అల్లుడుగా అయితే కెరీర్ ఇంకా బాగా సెటిల్ చేసుకోవచ్చు అని అనుకున్నాడో..  తెలియదు కానీ ఆ హీరో నిహారికను భలే టార్చర్ చేశారట . అయితే నిహారిక మాత్రం మొదటి నుంచి పెద్దలు చెప్పిన సంబంధం చేసుకోవాలి అంటూ మైండ్ లో ఫిక్స్ అయిపోయిందట .


"నాకు ఇలాంటివన్నీ సెట్ అవ్వవు ..మీకు ఏదైనా ప్రపోజల్ ఉంటే మా నాన్న గారితో మాట్లాడండి "అంటూ ఆ హీరోకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిందట . అయితే అంత ధైర్యం లేని హీరో నిహారికతో ఫ్రెండ్షిప్ అదే విధంగా లవ్ రెండూ కట్ చేసుకుని సైలెంట్ గా అయిపోయాడు. ఇప్పుడు ఆ హీరో ఫేడ్ అవుట్ అయిపోయాడు ..అవకాశాలే లేవు . కాగా నిహారిక మొదటి నుంచి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది తన తప్పు లేకుండా ఒక్క మాట అన్న కూడా పడదు ..బహుశా ఈ కారణంగా కూడా  చైతన్యకి అదేవిధంగా నిహారికకి పడకపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: