ఆ దర్శకుడు వద్దంటూ మొరపెట్టుకుంటున్న ఫ్యాన్స్.. బాలయ్య వింటారా..?

murali krishna
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో త్వరలో కొత్త సినిమా రానుంది. ఆ మూవీ కోసం తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు నందమూరి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.అసలే ఫస్ట్ సినిమా. ఏ మాత్రం తేడా కొట్టినా కష్టమే. అందుకే మా బాలయ్య వారసుడి మొదటి పిక్చర్ దద్దరిల్లి పోవాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్. యాక్షన్‌ జానర్‌లో కాకుండా సరికొత్త స్టోరీతో తెరకెక్కించాలని కోరుతున్నారట. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ప్రశాంత్‌ వర్మ స్టోరీ సినిమా మోక్షజ్ఞ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుందట. ఇంతకీ బాలయ్య వారసుడి మూవీపై ఏంటీ డిస్కషన్.అసలు సంగతేమిటంటే ఇప్పటికే మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఒక స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్లోజ్ లుక్‌తో ఉన్న ఫోటో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్‌ ఫ్యాన్స్‌కు టెన్షన్ క్రియేట్ చేస్తుందట. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. కానీ ఇటీవల ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో దేవకీ నందన సినిమా వచ్చింది.

 ఆ మూవీ చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ ఇలాంటి స్టోరీ ఇచ్చాడేంటి అంటూ కామెంట్స్ చేశారు. 
నందమూరి ఫ్యాన్స్‌కు దేవకీ నందన మూవీ టెన్షన్ పట్టకుందట. ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞతో మూవీ చేస్తున్నాడో అంటూ ఎగ్జైట్‌మెంట్ తో ఉన్నారు.మోక్షజ్ఞతో యాక్షన్ మూవీ అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫస్ట్ సినిమా యాక్షన్ జానర్‌లో వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్, దేవకీ నందన లాంటి స్టోరీలు కాకుండా కొత్త స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని కోరుతున్నారు. దీంతో బాలయ్య  అభిమానులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే బాలయ్య అభిమానుల సంఘం ప్రెసిడెంట్ తో సహా కొంతమంది వెళ్లి బాలయ్యని కలిసి వేరే దర్శకుడి చేతిలో పెట్టండి అంటూ రిక్వెస్టలు పెట్టుకున్నారట. కానీ బాలయ్య తరఫున ఆయన కుమార్తె తేజస్విని..’స్క్రిప్ట్ బాగా వచ్చింది’ అని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంమరి ప్రశాంత్ వర్మ ఎలాంటి స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: