బ్రేకింగ్: తండ్రి చనిపోయిన 24 గంటల్లోనే సమంతకు మరో భారీ షాక్..ఫ్యాన్స్ కన్నీరు..!

Thota Jaya Madhuri
హీరోయిన్ సమంతకి షాక్ మీద షాక్ లు తగిలిపోతున్నాయి. మరి ముఖ్యంగా సమంత పేరు అంటే ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ వినిపించేటివి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమె పేరుని సోషల్ మీడియాలో గబ్బు పట్టిస్తున్నారు కొందరు జనాలు. రీసెంట్గా ఆమె నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయింది . ఫుల్ డిజాస్టర్ గా మారిపోయింది . అడపాదడప జనాలు  తప్పిస్తే మిగతా ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడం లేదు.  ఆమె సిరీస్ బాగుంది అంటూ ఎంకరేజ్ చేయడం లేదు .


ఇలాంటి మూమెంట్లోనే సమంత తండ్రి మరణించాడు . చాలా ఆరోగ్యకరంగా ఉన్న సమంత తండ్రి సడన్గా హార్ట్ ఎటాక్ వచ్చి మరణించాడు ఆ విషయాన్ని సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది . "మళ్లీ మనం మీట్ అయ్యే వరకు నాన్న" అంటూ చాలా ఎమోషనల్ గా హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీ ని పోస్ట్ చేసింది . కాగా  ఈ షాక్ నుంచి కోలుకోక ముందే సమంత కు మరో బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. పరిణితి చోఫ్రా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ జ్యూవెలరికి  శ్రీజ రెడ్డి అనే ఒక మహిళ వ్యాపారవేత పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం అందుతుంది .


తాజాగా ఆమె మోసపోయాను అని గ్రహించి కాంతి దత్ మీద పోలీస్ కేసు పెట్టిందట . ఫోర్ జీరో సంతకాలతో పరువులు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ అభియోగాలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది . అంతేకాదు ఇతను గతంలో సస్టైన్ కార్డ్ అనే సంస్థ స్థాపించారు . సమంత -  ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి - కీర్తి సురేష్ తో కూడా పెట్టుబడులు పెట్టించాడు అంటూ సమాచారం అందుతుంది .ఆ సంస్థతో కూడా వీళ్ళను మోసం చేశాడు అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి.  గతంలో దీనిపై వార్తలు రాగా అదంతా ఫేక్ అంటూ పోస్ట్ పెట్టాడు.  కానీ రీసెంట్గా జరిగిన ఇష్యూతో మరొకసారి ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. ఆయన మోసం చేసిన లిస్టులో కీర్తి సురేష్ - సమంత - పరిణితి చోప్రా .. డిజైనర్ శిల్పారెడ్డి తో పాటు పలువురు బడా స్టార్ హీరోయిన్ లు అదే విధంగా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సుమారు 100 కోట్లకు పైగానే ఆయన మోసానికి పాల్పడినట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి.  సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూడా ఆయన పై కేసు ఫైల్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: