స్నేహితులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న .. స్టార్ హీరోయిన్లు వీరే ..!

Amruth kumar
ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది  హీరోయిన్లు తమ స్నేహితుల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. స్నేహం ఎంత బలమైన బంధం అనేది వారు చూపిస్తున్నారు .. ఇక మరి కొంత మంది హీరోయిన్లు సంవత్సరాలు తరబడి స్నేహం చేసి ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు .. మరి అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇక్కడ చూద్దాం .. ఇక రీసెంట్గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన పదిహేనేళ్ల స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతుంది .. ఆంటోనీ ఒక బిజినెస్ మాన్ వీళ్ళిద్దరి పేర్లు కలిపి వాళ్ళ పెంపుడు కుక్క కు NYKE అని పేరు పెట్టారు ..

ఇక  కీర్తి ఆంటోనీల పెళ్లి డిసెంబర్ 12న ఎంతో ఘనంగా జరగబోతుంది . స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 లో పెళ్లి చేసుకుంది .. వీళ్ళిద్దరూ కూడా ఎంతోకాలంగా స్నేహితులు ఎక్కువ సమయం కలిసి గడపడం కారణంగా వీరి స్నేహం ప్రేమగా మారింది .. ఇక గతంలో కాజోల్ తన పెళ్లి గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఇక మరో హీరోయిన్ అమలాపాల్ - జగత్ దేశాయ్ మంచి స్నేహితులు .. అమలాపాల్ విడాకుల తర్వాత జగత్ దేశాయ్ అండగా నిలిచాడు .. దీంతో వీళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది .

హన్సిక , సోహైల్ కతురియా 2023 లో పెళ్లి చేసుకున్నారు .. వీరిద్దరు కూడా ఎంతో కాలంగా మంచి స్నేహితులు .. ఆధ్యాత్మిక వంటి ఇష్టాలు వీరిని దగ్గర చేశాయి.. ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లారు . శ్రియా శరణ్ , ఆండ్రీ కోస్చీవ్ 2018 లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలా కాలంగా స్నేహితులు . యోగా, ఆధ్యాత్మికత వంటి ఇష్టాలు వీళ్ళని దగ్గర చేశాయి. స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: