అంబానీ నుంచి ఆదాని వరకు .. వీరి మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా..?
ఇక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధా మూర్తి తన చదువు పూర్తయిన తర్వాత టాటా మోటార్స్ లో ఉద్యోగం చేశారు .. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజనీర్ కూడా సుధా మూర్తి కావటం ఇక్కడ విశేషం .. ప్రస్తుతం ఇంజనీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే అది సుధా మూర్తి కారణంగానే. ఇక దివంగత రతన్ టాటా .. మొదటిలో టాటా కంపెనీలో ఉద్యోగిగా మొదలయ్యారు .. అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ఐబిఎం నుంచి మంచి శాలరీ ప్యాకేజీ తో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి టాటా సంస్థ చైర్మన్‌గా ఎదిగారు. బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.ఇక పెప్సికో మాజీ సీఈవో అయిన ఇంద్రానూయి 18 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ టెక్స్టైల్స్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని మొదలుపెట్టి ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రిగా ఎదిగారు. ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ధనవంతుడుగా ఉన్న గౌతమ్ ఆదానీ.. డైమండ్ స్టార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తర్వాత ముంబైలోని జవేరి బజార్లో సొంతంగా వజ్రాలు వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో ఎదుగుతూ అపర కుబేరుడుగా ఎదిగాడు.