ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. ఆ విషయం బయట పెట్టిన హీరోయిన్?

praveen

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'రాజా సాబ్' అభిమానుల్లో చాలా బజ్‌ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ ఎలా నటించాడో చూడాలని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ సరదాగా నటించిన సినిమా లేదు. సాహో, సలార్ లాంటి సినిమాలు వచ్చాయి కానీ అవి బుజ్జిగాడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ప్రభాస్ ని చూపించలేదు అదే ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం తెలిపింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ప్రభాస్ తనకు చాలా ఇష్టమైన హీరో అని ఆమె రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శకుడు మారుతి ఈ సినిమా షూటింగ్‌ను ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా చాలా కష్టపడుతున్నారు. నిర్మాత ఎస్‌కెఎన్ కూడా ఈ సినిమాను నిర్ణయించిన సమయానికి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.
మాళవిక మోహనన్ వ్యాఖ్యల ప్రకారం, ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అంటే ఇది మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు 2025, ఏప్రిల్ 10వ తేదీన కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు మారుతి చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవ్వాలని ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సినిమాలో సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, జరీనా వహాబ్, వెన్నెల కిశోర్, వరలక్ష్మి శరత్ కుమార్, జిష్ణు సెన్‌గుప్తా, బ్రహ్మానందం, యోగి బాబు వంటి నటులు నటిస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. 'రాజా సాబ్' సినిమాకు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు ఎడిటింగ్ పనులు చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: