థియేటర్లో కన్నీరు పెట్టుకున్న మెగాస్టార్ .. దెబ్బకు ఆ స్టార్ హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి .. కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎంతో దృడ సంకల్పంతో స్టార్ హీరోగా ఎదిగారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో నెంబర్ వన్ హీరో స్థానం సొంతం చేసుకున్నారు. ఇక చిరంజీవి ఎందరో నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక చిరంజీవి నట జీవితంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి .. అలాగే ఎన్నో ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి .. ఇక పలు ఇంటర్వెల్లో చిరంజీవి తన సినీ ప్రయాణంలో చోటుచేసుకున్న అరుదైన ఘటనలు గుర్తు చేసుకున్నారు .

 అలాగే చిరంజీవి ఏడ్చిన మూవీ శంకరాభరణం .. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదట అప్పుడు ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శంకరభరణం సినిమాలో హీరోయిన్గా నటించిన మంజు భార్గవి చిరంజీవిని ఆ సినిమా ప్రీమియర్ షో కి ఆహ్వానించారట .. వీరిద్దరూ కోతల రాయుడు సినిమాలో కలిసి నటించారు .. ఆ క్రమంలోనే ఆ పరిచయంతో చిరంజీవిని మంజు భార్గవి రమ్మన్నారట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి అషో కి వెళ్లారట. థియేటర్లో చిరంజీవి మంజు భార్గవి పక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారట. ఇక ఆ సమయానికి చిరంజీవి చిన్న హీరో ఆయనకు దర్శకుడు కే విశ్వనాథ్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో గారితో అసలు పరిచయం లేదు ..

ఇక మంజు భార్గవి పక్కనే కూర్చున్న చిరంజీవి శంకరాభరణం క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యారట ,, కంటి నుంచి నీరు దారిలాగా కారిపోతున్నాయట..ఎంత కంట్రోల్ చేసుకున్న ఆ నీరు ఆగి లేదట ..  అది గమనించిన మంజు భార్గవి తన చిరకొంగు చిరంజీవికి  ఇచ్చిందట. ఆమె కొంగు తీసుకుని చిరంజీవి కళ్ళు తుడుచుకుంటుండగా లైట్స్ వేశారట. మంజు భార్గవి చీర కొంగు చిరంజీవి చేతిలో ఉండటం అందరూ చూశారట. ఆ మూవీ ప్రీమియర్ చూడటానికి వచ్చిన ప్రముఖులు అందరు ఆశ్చర్యానికి గురయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: