సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!
ముఖ్యంగా సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి కూడా ఇతని బాధితులుగా ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా విచారణలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇకపోతే పరిణీతి చోప్రాకు తన వ్యాపారంలో షేర్ ఉంది అంటూ బాలీవుడ్ హీరోయిన్ ని కూడా బురిడీ కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా దాదాపు రూ.1000 కోట్లకు పైగా మోసం చేసినట్లు కాంతి దత్ పై ఆరోపణలు వెలువడ్డాయి. ముఖ్యంగా పలువురు ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసే మోసం చేసినట్లు కూడా కాంతి దత్ పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
గతంలో కూడా ఇతనిపై సి. సి. ఎస్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇకపోతే హీరోయిన్లను పెట్టుబడుల పేరుతో మోసం చేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా డబ్బు వ్యామోహంలో ఎలాంటి పనులైనా చేస్తారని మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సెలబ్రిటీలను ,వ్యాపారవేత్తలను డబ్బున్న వాళ్ళను ఎరగా వేసుకొని డబ్బు సంపాదిస్తున్న కాంతి దత్ పై కేసు నమోదవడం గమనార్హం.