ప్రభాస్ రికార్డులను ఆ స్టార్ హీరో చెరిపేస్తాడా .. గట్టిగానే టార్గెట్ చేశాడుగా..!

Amruth kumar
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కు ఇండియా లోనే కాదు జపాన్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంది .. జపాన్లో షారుక్ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతుంటాయి .. రీసెంట్గా షారుక్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ కూడా జపాన్ లో రిలీజ్ అయింది .. ఈ సినిమాకి అక్కడ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది . తొలిరోజే ఈ సినిమాకు ఏకంగా 1.94 వేల టిక్కెట్లు అమ్ముడైపోయాయి .. వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా ఇదే దూకుడు చూపించినది జవాన్ .. కానీఈ సినిమా  లిస్టులో ఐదో ప్లేసులోనే ఉంది. డే వన్ ఫుట్‌ఫాల్స్ జాబితాలో జవాన్ కంటే ముందు సలార్ ప్లేస్ దక్కించుకుంది .. 2.22 వేల టిక్కెట్లతో మూడో స్థానంలోలో పఠాన్ ఉంది .. అలాగే 6.51 వేల టికెట్లతో సాహూ రెండో స్థానంలో ఉంది .


ఇక‌ ఇప్పుడు ఈ లిస్టులో టాప్ లో ఉన్న సినిమా త్రిబుల్ ఆర్ .. ఈ సినిమా జపాన్లో ఏకంగా 8.23 వేల టిక్కెట్లు అమ్ముడైపోయాయి .. ఇక ఇప్పుడు ఈ రికార్డులు బ్రేక్ చేయడం అన్నది జవాన్ కి సాధ్యం కాదు .  కానీ మొత్తంగా బిజినెస్ లో మిగతా సినిమాల రికార్డులను మాత్రం తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక పటాన్ - సలార్ తర్వాత ప్లేస్ లో జవాన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే . అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ వర్సెస్ షారుక్ ఖాన్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. స‌లార్ రికార్డులను జవాన్ అధిగమిస్తుందని షారుక్ ఖాన్ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు..


ఇక దానికి దీటుగా ప్రభాస్ అభిమానులు సమాధానం ఇస్తున్నారు.  ఇక జపాన్లో షారుక్ ఖాన్ ప్రభాస్ ఇద్దరికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకంగా ప్రభాస్ కోసం జపాన్ నుంచి వచ్చే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చి మరీ విషెస్ చెప్పిన డార్లింగ్ జ‌పాన్ అభిమానులెంతో మంది. షారుక్ విష‌యంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో ఇలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి కూడా జ‌పాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: