ఆ జనాలకి లేని నొప్పి..బన్నికి ఎందుకంటా..?
తెలంగాణ గవర్నమెంట్ పుష్ప2 సినిమా టికెట్ రేట్స్ ని పెంచుతూ బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఇది బన్నీ ఫాన్స్ కి హ్యాపీ కలిగించే విషయమైనా.. సగటు సామాన్య జనానికి సామాన్య కుటుంబానికి మాత్రం బాగా కష్టం కలిగించే వార్త. కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలి అంటే వేలకు వేలు వదులుకోవాల్సిందే. అది కూడా ఇక బిగ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా చూడాలి అంటే కచ్చితంగా వేలు జేబులో పెట్టుకొని పోవాల్సిందే . క్రెడిట్ కార్డు గోకాల్సిందే అలాంటి సిచువేషన్ క్రియేట్ అయింది .
అయితే దీని అంతటికి కారణం స్టార్ట్స్ రెమ్యూనరేషన్ అంటూ మాట్లాడుతున్నారు జనాలు. అసలు ఈ స్టార్స్ అంతంత కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉంటే ప్రొడ్యూసర్స్ ..డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ రేట్లో సినిమాని అమ్మరు కదా . అప్పుడు డిస్ట్రబ్యూటర్స్ కూడా మనకు తక్కువ రేట్ కి టికెట్ ఇస్తారు కదా .. ఎందుకు స్టార్స్ ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారు . మీకోసం ఎంటర్టైన్ చేయడానికి ఈ విధంగా కష్టపడుతున్నామంటూ బాగా మైక్ పట్టుకుని మాట్లాడే స్టార్స్.. జనాల ఎంటర్టైన్మెంట్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకోలేరా..? అంటూ నిలదీస్తున్నారు .
ఈ సినిమా కోసం బన్నీ 275 కోట్ల రెమ్యూనరేష అందుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. అయితే ఆ కారణంగానే టికెట్ రేట్స్ భారీగా పెంచారు అంటూ కూడా బాగా వార్తలు వినిపిస్తున్నాయి . జనాలు డబ్బులు పెట్టుకొని చూసే దానికి రెడీ అయినప్పుడు బన్నీ కి ఏంటి నొప్పి..? అంటూ కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . బన్నీ తన పని తాను చేసుకుపోతున్నాడు . బన్నీ కష్టపడ్డారు ..దానికి ఫలితం తీసుకున్నాడు ..ఇక జనాల ఒపీనియన్ జనాలది. జనాలకి ఇష్టం ఉంటే చూడండి ..డబ్బులు ఎక్కువ అనుకుంటే మానుకోండి ..ఓటీటీ లు ఉన్నాయిగా అంటూ కొందరు సజెస్ట్ చేస్తున్నారు . కానీ బన్నీ ఫ్యాన్స్ టికెట్ లక్ష రూపాయలు పెట్టినా సరే కచ్చితంగా పుష్ప2 సినిమాను చూడడానికి రెడీగా ఉన్నారు..!