నాగార్జున అక్కినేని హీరోగా నటించిన మూవీల్లో హలో బ్రదర్ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నాగ్ తొలిసారి రెండు విభిన్న కవల సోదురుల పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.అప్పట్లో బిగ్‌బాస్ షో వేదికగా నాగార్జున ఈ సినిమాలో తన డూప్‌గా ఎవరు నటించారానే విషయమై ఈ షోలో వెల్లడించాడు. ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున రెండు సీన్లలో కనిపించే సన్నివేశాల్లో హీరో శ్రీకాంత్ తనకు డూప్‌గా నటించినట్టు నాగార్జున ఆ షోలో వెల్లడించాడు.ఇక హీరోగా శ్రీకాంత్‌కు ఇ.వి.వి. సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. అంతకు ముందు శ్రీకాంత్ ఇ.వి.వి.సత్యనారాయణ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘వారసుడు’ సినిమాలో నటించాడు. ఆ అనుబంధంతోనే నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లో నాగార్జున.. ఇద్దరుగా కనిపించే సన్నివేశాల్లో ఆయనకు డూప్‌గా నటించాడు శ్రీకాంత్. నాగార్జున, శ్రీకాంత్ ఇద్దరి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఒకే రకంగా ఉండటంతో ఇ.వివి.సత్యనారాయణ.. శ్రీకాంత్‌ను నాగార్జున డూప్‌గా ‘హలో బ్రదర్’ సినిమాలో నటింపచేసాడు. హీరో శ్రీకాంత్.. నాగార్జున హీరోగా నటించిన ‘వారసుడు’ సినిమాతో పాటు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.ఇక హలో బ్రదర్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కే.ఎల్. నారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి కోటీ సంగీతం అందించారు. రాజ్ కోటీ సంగీతం అందించారు. వీళ్లిద్దరు చివరగా సంగీతం అందించిన చివరి సినిమా అని చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య నటించారు.ఇక నాగార్జున, శ్రీకాంత్ వీరిద్దరి కాంబోలో ఈ వీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లోనే వారసుడు సినిమా కూడా తెరకెక్కింది. నాగార్జున, శ్రీకాంత్‌ల పర్సనాలిటీలు దగ్గరగా ఉండడంతో హలో బ్రదర్స్ లో నాగార్జునకు డూప్ గా శ్రీకాంత్ కనిపించాడట.