ప్రియుడితో సరసాలు చేస్తూనే..పక్కింటి వాడి కాపురంలో చిచ్చు పెఱిన తమన్నా ?

Veldandi Saikiran
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమన్నా సినీ ఇండస్ట్రీకి పరిచయమే దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది. సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస పెట్టి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా నిలిచింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో తమన్నా ఒకరు కావడం విశేషం.

ఇక తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.... ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ తమన్నాపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా రంభ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.... నా భర్త సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవడం లేదంటూ హాట్ కామెంట్స్ చేసింది.

గతంలో నేను సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవమని నా భర్తను అడిగానంటూ రంభ చెప్పు కొచ్చింది. కానీ నా భర్త నన్ను ఫాలో అవకుండా తమన్నాను ఫాలో అయ్యాడు. దాంతో నాకు చాలా బాధ అనిపించింది. తమన్నాని ఫాలో అవ్వొద్దని నేను అనలేదు. కానీ తమన్నాను ఫాలో అవ్వడం నాకు చాలా సంతోషమే. కానీ భార్యగా నాకు నా భర్త కొంత ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని నాకు కాస్త బాధగా అనిపించింది అంటూ రంభ చెప్పుకొచ్చింది.

నాకు కొంచెం కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధగా ఉందంటూ రంభ తన ఆవేదనను వెల్లడించింది. అసలు నన్ను సోషల్ మీడియాలో నా భర్త ఎందుకు ఫాలో అవడం లేదో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదంటూ రంభ తన భర్తను ప్రశ్నించింది. ప్రస్తుతం తమన్నాపై రంభ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: