ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్న సమంత.. కళ్లెదుటే బాంబు పేలి..?

Pandrala Sravanthi
 ఏంటి సమంత కళ్ళ ముందే బాంబు పేలిందా.. ఆ ప్రమాదం నుండి సమంత ఎలా బయటపడింది.. అసలు బాంబు పేలిన చోట సమంత ఎందుకు ఉంది అనే షాకింగ్ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత అప్పట్లో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమె నటించిన వరుస సినిమాలు హిట్ అవ్వడంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కాస్త దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన పూర్తి దృష్టిని బాలీవుడ్ పైనే పెడుతోంది.తాజాగా తండ్రిని కోల్పోయిన సమంత ఎంతో బాధను దిగమింగుకొని తన తండ్రి కి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అయితే సమంత గురించి ఓ షాకింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో ఆమె కళ్లెదుటే మానవ బాంబు పేలిందట. ఇక అసలు విషయం ఏమిటంటే.. సమంత మహేష్ బాబు కాంబినేషన్లో శ్రీనువైట్ల దర్శకుడిగా చేసిన దూకుడు మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా షూటింగ్ కోసం సమంత మహేష్ బాబు చిత్ర యూనిట్ అందరు కలిసి టర్కీ వెళ్లారట. ఆ టైంలో షూటింగ్ ముగిశాక ఓసారి సమంత షాపింగ్ చేస్తానని బయటికి వెళ్లిందట.

ఇక ఆమె బయటికి వెళ్ళిన సమయంలో షాపింగ్ చేసిన ప్లేస్ లోనే బాంబు ఉందనే విషయం శ్రీను వైట్ల ఫోన్ చేసి సమంత చెప్పడంతో అక్కడి నుండి బయటపడి తొందరగా హోటల్లోకి వచ్చేస్తుందట. అలా సమంత అక్కడ నుండి కాస్త దూరంలో ఉండగానే మానవ బాంబు పేలి చాలామందికి గాయాలయ్యాడట. అయితే ఈ విషయాన్ని స్వయంగా దూకుడు మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అలా తృటిలో సమంత ప్రమాదం నుండి బయటపడిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: