ఖుషి రీ-రిలీజ్: ప్రభాస్, మహేష్, బాలయ్య రికార్డ్స్ బద్దలు కొట్టిన పవన్ ?
ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. 2001 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక హీరోయిన్గా నటించారు. వీరిద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ఎస్ జె సూర్య. ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్ అయింది. అప్పట్లో ఈ సినిమా కోసం 2.5 కోట్లు ఖర్చు చేసి తీస్తే... త్రిబుల్ వసూలు చేసింది.
అయితే ఖుషి సినిమాను గత సంవత్సరం ఫ్రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ చేసిన తర్వాత ఖుషి సినిమాను చూసేందుకు జనాలు ఇగబడ్డారు. ఈ తరుణంలోనే.. రీ రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది ఖుషి. గతంలో నైజాంలో జల్సా సినిమా మొదటిరోజు 1.26 కోట్లు వసూలు చేస్తే... రీ రిలీజ్ అయిన ఖుషి సినిమా 1.65 కోట్లు వసూలు చేయడం గమనార్హం.దీన్నిబట్టి...మనం చూడవచ్చు..ఖుషి సినిమాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో..!
ఇక ఈ ఖుషి సినిమా మొదటిరోజు ఓవరాల్ గా 3.15 కోట్లను వసూలు చేసింది. అటు జల్సా 2.57 కోట్లనే నమోదు చేయడం గమనార్హం. ఇలా ఓవరాల్ గా ఏడు కోట్ల వరకు... రీ రిలీజ్ చేసిన తర్వాత ఖుషి సినిమా సంపాదించింది. అయితే మొదటి రోజు ఇలా ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో...పోకిరి, బిల్లా, చెన్నకేశవరెడ్డి, వర్షం సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది ఖుషి సినిమా.