ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు జానకిరామ్ భార్య కండిషన్స్.. అందుకే దూరమయ్యారా ?

Veldandi Saikiran
నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఎంతమంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తాజాగా హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి నూతన వారసుడు డెబ్యూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.

యలమంచిలి గీత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కూచిపూడి డ్యాన్సర్, వీణ రావు నటిస్తోంది. తాజాగా హీరో తారక రామారావును పరిచయం చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో తారక రామారావు లాంగ్ హెయిర్ తో పాటు అతని బాడీనీ చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. అదిరిపోయే బైక్ పై రైడ్ చేస్తున్న స్టిల్స్ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా.... ఈ సినిమాకు సంబంధించి వైవిఎస్ చౌదరి మీడియా ముందు మాట్లాడారు. అతని మాటలను బట్టి తానే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు దూరంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు తారక్, కళ్యాణ్ రామ్ మద్దతు ఉందా అని మీడియా ప్రశ్నించగా.... వైవిఎస్ చౌదరి సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. వారిద్దరి పేర్లు చెప్పడానికి కూడా చౌదరి ఆసక్తి చూపించడం లేదు.

పైగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఈ హీరోకి బంధువులు అన్నట్టుగా మాట్లాడారు. ఈ అబ్బాయికి తల్లి ఉంది కదా ముందుగా తల్లి అనుమతి చాలా అవసరం. ఆ తర్వాతే చుట్టాలు అంటూ వైవిఎస్ చౌదరి సమాధానమిచ్చారు. నందమూరి జానకిరామ్ భార్య తనకి కొన్ని కండిషన్లు పెట్టారని వాటి ప్రకారమే తాను నడుచుకుంటున్నానని చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: