సమంత, కీర్తి సురేష్ లను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
అయితే ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయని అందరికీ తెలుసు కానీ ఏకంగా సెలబ్రిటీలే మోసపోయారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇతను సస్టెయిన్ కార్డ్ అనే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా వచ్చే లాభాల్లో షేర్ ఇస్తానని చెప్పి వ్యాపారంలో చేరమని అన్నాడు.
స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డిలతో పెట్టుబడులు పెట్టించి వాళ్లను మోసం చేశాడు. ఇతడు ఇతర వ్యాపారవేత్తల ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేశాడని సమాచారం. ఇలా చాలా మందికి చాలా అబద్దాలు చెప్పి అన్యాయంగా వారిని మోసం చేసి దాదాపు రూపాయలు 100 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. ఇకపోతే ఇతని నిజస్వరూపం తెలుసుకున్న శ్రీజ రెడ్డి అనే మహిళ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఇతనిపై సెంట్రల్ బ్యాంక్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాంతి దత్ పై కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్ని మోసాలు బయటికి వస్తాయో చూడాలి మరి.