చిక్కుల్లో అల్లు అర్జున్...ఆ పేరు పెట్టుకోవడంపై పోలీసులకు ఫిర్యాదు!

MADDIBOINA AJAY KUMAR
స్టార్ హీరో అల్లు అర్జున్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. ఇకపోతే పుష్ప మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుందన్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది.
ఇదిలా ఉండగా గ్రీన్‌ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌ అల్లు అర్జున్ పైన సికింద్రాబాద్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పిలవడంపై శ్రీనివాస్ గౌడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే వారికి మాత్రమే సొంతమని అన్నారు. ఆర్మీ జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని తెలిపారు. కానీ అల్లు అర్జున్ అవేం పట్టించుకోకుండా తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నారని చెప్పారు. అందుకు స్టార్ హీరో అల్లు అర్జున్ పై చర్య తీసుకోవాలని అన్నారు.
 దీనిపై అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ..  అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ఏం పిలవడం లేదని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా సినిమా విడుదల సమయంలో తమ హీరోను టార్గెట్ చేసి ఇలా కంప్లైంట్ ఇవ్వడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ టీమ్ ఎలా స్పందిస్తుందో, అసలు స్పందిస్తుందో లేదో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: