సినిమా హిట్టే.. కానీ ఎందుకు చేశానా అని బన్నీ విలన్ అనుకున్న సినిమా ఏదో తెలుసా?

praveen
సాదరణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నటులు అటు సినిమాలు చేసే కొద్ది నటనలో మరింత ప్రావీణ్యం పొందుతూ ఉంటారు  ఈ క్రమంలోనే ఇక కొన్ని కొన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మరింత గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా నటుడిగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత గత సినిమాల విషయంలో కొంతమంది నటులు పశ్చాత్తాపం చెందడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో ఇలాంటి పశ్చాత్తాపం ఉండడం కామన్. కానీ ఇక్కడ ఒక నటుడికి మాత్రం సూపర్ హిట్ అయిన సినిమా విషయంలో కూడా ఇలాంటి ఫీలింగ్ ఉందట. ఆ సినిమాను ఎందుకు చేశానా అని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారట ఆయన.

 ఆ నటుడు ఎవరో కాదు ఫహాద్ ఫాసిల్. ఈ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆయన స్టార్ హీరో కానీ కేవలం హీరోగా మాత్రమే కాదు వైవిద్యమైన పాత్ర వస్తే నో చెప్పకుండా చేసేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు ఎంత మంది హీరోలు ఉన్నా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫహద్ ఫాసిల్ ఇతర హీరోల సినిమాల్లో ఒక పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రలో ఏదో కొత్తదనం ఉంది అని అటు ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ఫాహద్ ఫాసిల్ పాత్రలు ఎంచుకునే విషయంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఈ స్టార్ నటుడు ఒక సినిమా విషయంలో మాత్రం పశ్చాత్తాప పడుతూ ఉంటాడట.

 ఆ మూవీ ఏదో కాదు తమిళ హిట్ మూవీ మామన్నాన్. వడివేలు, ఉదయనిది స్టాలిన్, కీర్తి సురేష్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ సినిమాలో ఫహద్ విలన్ పాత్ర చేశాడు. కుల దురహంకారం, ఇగో తో రగిలిపోయే పొలిటిషన్ పాత్ర అతనిది. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఫహాద్ కెరియర్లో ఇది ఒక చెప్పుకోదగ్గ పాత్ర. అయితే ఈ సినిమాలో కుక్కల్ని చంపే సన్నివేశంలో ఫహద్ నటించాల్సి ఉంటుందట. అయితే ఇలాంటి సన్నివేశాలలో నటించడం ఆయనకి ఎంతగానో బాధ కలిగించిందట. తనకి కుక్కలు అంటే ఎంతో ఇష్టమని తన ఇంట్లో కూడా చాలా కుక్కలు ఉన్నాయని.. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటానని.. అలాంటి తాను తెరమీద కుక్కల్ని చంపే పాత్ర చేయడం బాధ కలిగించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎందుకు చేశానో అని అనిపిస్తూ ఉంటుంది అంటూ ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hit

సంబంధిత వార్తలు: