రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన సింహాద్రి మూవీ.. కలెక్షన్లు ఎంతంటే?
కొన్ని నెలల క్రితం సింహాద్రి సినిమా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రీరిలీజ్ లో సింహాద్రి సినిమా ఏకంగా 4.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఒక విధంగా ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం రికార్డ్ అనే చెప్పాలి. 2023 సంవత్సరం మే నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకు అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు.
ఈ సినిమా రీరిలీజ్ ను అప్పట్లో తారక్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సింహాద్రి సినిమా రీరిలీజ్ తర్వాత తారక్ నటించిన పలు సినిమాలు రీరిలీజ్ అవుతాయని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తుండగా వార్2 సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది. వార్2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందేమో చూడాలి. స్పై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు అనే సంగతి తెలిసిందే.