బిజినెస్ మేన్: రీ రిలీజ్ లో పవన్ రికార్డుని తొక్కిపడేసిన మహేష్ బాబు.?

Pandrala Sravanthi
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.హీరోల బర్త్డేలకి కచ్చితంగా వారికి సంబంధించి గతంలో హిట్టు కొట్టిన సినిమాలను 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.. ఇలా రీ రిలీజ్ చేస్తే కోట్లకు కోట్ల కలెక్షన్లను సంపాదిస్తున్నారు నిర్మాతలు. అలా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదిస్తున్నారు. అలా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆయన నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బిజినెస్ మాన్ సినిమాని 4కె వెర్షన్ లో రీ రిలీజ్ చేశారు. మరి దానికి వచ్చిన కలెక్షన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన బిజినెస్ మాన్:

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన బిజినెస్ మాన్ మూవీ 2012 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 100 నుండి 110 కలెక్షన్లను సాధించిన ఈ సినిమా అప్పట్లోనే మంచి హిట్ కొట్టింది.అయితే ఈ సినిమాని రీ రిలీజ్ లో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేశారు.4కే వెర్షన్ లో విడుదలైన బిజినెస్ మాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు అప్పటివరకు ఉన్న చాలామంది హీరోల రికార్డులను కూడా తొక్కిపడేసింది. ఇక రీ రిలీజ్ అయిన సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ అప్పటి వరకు ఉన్న సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీ.కానీ ఖుషి సినిమాని కూడా తొక్కిపడేసి మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన చూసి అప్పటి ప్రేక్షకులే ఫిదా అయ్యారు అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇంకా ఎంతలా అట్రాక్ట్ అవుతారో చెప్పనక్కర్లేదు. అలా రీ రిలీజ్ అయిన బిజినెస్ మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.
 బిజినెస్ మాన్ మూవీ నైజాంలో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 42.1 లక్షలు, నెల్లూరులో 7.13 లక్షలు కృష్ణాజిల్లాలో 26.5 లక్షలు, వెస్ట్ లో 15.28 లక్షలు ఈస్ట్ లో 34.2 లక్షలు సీడెడ్ లో 35.6 లక్షలు, గుంటూరులో 31.4 లక్షలు అలా ఏపీ తెలంగాణ మొత్తంలో 4.42 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఓవర్సీస్ లో 35 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా చూసుకుంటే 26. 76 లక్షలు కర్ణాటకలో 27.3 లక్షలు వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మాన్ రీ రిలీజ్ కలెక్షన్లు చూసుకుంటే 5.31 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: