టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో “ఒక్కడు” సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో మహేష్ స్టార్ హీరో అయ్యారు.. ఈ సినిమాలో మహేష్ సరసన భూమికా చావ్లా హీరోయిన్ గా నటించింది.అయితే మహేష్ బాబు నటించిన ఈ సూపర్ హిట్ మూవీని తమిళంలో గిల్లీ అనే పేరుతో దళపతి విజయ్ రీమేక్ చేశాడు. 2004లో విజయ్, త్రిష కాంబోలో వచ్చిన ఈ రీమేక్ మూవీ ‘గిల్లీ’ భారీ విజయం సాధించింది.. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..చాలా సెంటర్లలో 200 రోజులు ఆడిందని సమాచారం.. విజయ్ కెరీర్‌లో గిల్లీ మూవీ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది...ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయ్ బ్లాక్ బస్టర్ గిల్లీ మూవీని రీ రిలీజ్ చేశారు.ఈ సినిమాను ఏప్రిల్ 20న తమిళనాడుతో పాటుగా, ఓవర్సీస్‌లో కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. దాదాపు 800 థియేటర్లలో ఈ మూవీని మళ్లీ విడుదల చేసినట్టు సమాచారం..
అయితే రీ రిలీజ్ లో కూడా విజయ్ గిల్లీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..రీ రిలీజ్ సందర్భంగా గిల్లీ మూవీకి దాదాపు పది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి... రీరిలీజ్ లోను గిల్లీ మూవీకి భారీగా కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు..టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే...మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్స్ రీ రిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.. అయితే ఒక్కడు రీమేక్ అయినా గిల్లీ మూవీని టాలీవుడ్ ప్రేక్షకులు దారుణంగా ట్రోల్ చేస్తూ వచ్చారు.గిల్లీ మీద మీమ్స్ క్రియేట్ చేసి మహేష్, విజయ్ ని పోలుస్తూ నెట్టింట తెగ రచ్చ చేసారు.. కానీ తమిళ్ లో రీ రిలీజ్ అయిన ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చూసి టాలీవుడ్ ప్రేక్షకులు దెబ్బకు షాక్ అయ్యారు..ఏ సినిమాని అయితే టాలీవుడ్ లో ట్రోల్ చేసారో ఆ సినిమానే తమిళ్ ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు..తమిళ్ ప్రేక్షకులకి ఓ సినిమా నచ్చిందంటే ఆ సినిమా స్థాయి అమాంతం పెరుగుతుంది.. దానికి ఉదాహరణంగా విజయ్ గిల్లీ మూవీని చూపించవచ్చు..