పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు.ఇక ఫ్యాన్స్ తో పాటు హీరోయిన్లు, హీరోలలో కూడా ఈయన్ని అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.అలా ఇండస్ట్రీ జనాలు ఎంతగానో అభిమానించే ప్రభాస్ ని ఇండస్ట్రీలో ఉండే ఓ హీరోయిన్ మాత్రం అస్సలు అభిమానించదట. మరి ఆ హీరోయిన్ ఎవరు..ఆ విషయంలో అందరికీ నచ్చిన ప్రభాస్ ఈ హీరోయిన్ కి మాత్రం ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ తో సినిమా అనగానే చాలామంది హీరోయిన్లు ప్రభాస్ ఇంటి నుండి వచ్చే ఫుడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ తో నటించిన చాలామంది హీరోయిన్లు ప్రభాస్ ఇంటి నుండి వచ్చే పెద్ద క్యారేజీ భోజనం చేసిన వారే.అలా షూటింగ్ సెట్ లో ప్రభాస్ తో నటించే చాలామంది ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూశారు.
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మొదలు ఆయనతో నటించిన ఎంతోమంది హీరోయిన్లు ప్రభాస్ ఇంటి ఫుడ్ ని తిని ఆ రుచి ఎలా ఉందో రివ్యూలు కూడా ఇచ్చారు. అయితే ప్రభాస్ ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా షూటింగ్ సమయంలో ఖచ్చితంగా ప్రభాస్ ఇంటి నుండి ఫుడ్ వస్తుంది. ఆ టైంలో షూటింగ్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఫుడ్ టేస్ట్ చేస్తారు. అయితే అందరికీ నచ్చిన ప్రభాస్ ఇంటి భోజనం ఈ హీరోయిన్ కి మాత్రం నచ్చలేదు కావచ్చు.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే.ప్రభాస్ తో రాధే శ్యామ్ మూవీలో నటించింది పూజ హెగ్డే.
అయితే పూజ హెగ్డే తో చేసినప్పుడు కూడా ప్రభాస్ ఇంటి నుండి భోజనం వచ్చిందట.కానీ ఈ హీరోయిన్ మాత్రం ప్రభాస్ ఇంటి భోజనం రివ్యూ ఇవ్వలేదు. భోజనం తిన్నా కూడా అది ఎలా ఉందో మాత్రం చెప్పకపోవడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ప్రభాస్ ఇంటి భోజనం చాలామందికి నచ్చింది కానీ ఒక్క పూజా హెగ్డే కి మాత్రం నచ్చలేదు కావచ్చు. ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ప్రభాస్ తో వచ్చిన గొడవల కారణంగానే ప్రభాస్ ఇంటి భోజనం గురించి పూజ హెగ్డే ఎలాంటి రివ్యూలు ఇవ్వలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.