కన్నడ నటుడుకి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. పృథ్వి ఎంత పుచ్చుకున్నాడంటే?
అన్ లిమిటెడ్ ట్విస్టులతో కొనసాగుతున్న బిగ్ బాస్ 8వ సీజన్లో ఇక ఇటీవలే వారాంతంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక ఈ వారాంతంలో మాత్రం ఏకంగా రెండు ఎలిమినేషన్స్ జరిగాయ్. శనివారం రోజున టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రాగా.. ఆదివారం రోజున పృథ్వీరాజ్ శెట్టి అటు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. వాస్తవానికి టేస్టీ తేజతో పాటు అవినాష్ కి ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ అవినాష్ టికెట్టు ఫినాలే గెలుచుకోవడంతో చివరికి అవినాష్ తర్వాత ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న పృథ్వీరాజ్ బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఇక అటు హౌస్ లో ఎవరికి అదరకుండా బెదరకుండా గేమ్ ఆడిన పృథ్విరాజ్ శెట్టి అటు బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా విన్నర్ కు దక్కే పాలతోషకం పృథ్విరాజ్ కి దక్కిందట. అప్పటికే సీరియల్స్ లో బిజీ బిజీ నటుడిగా పేరుగాంచిన పృథ్వీరాజ్ వారానికి 2.5 లక్షలు అందుకున్నాడట. ఈ లెక్కన 13 వారాలకు గాను 32 లక్షల వరకు పృథ్వీరాజ్ పుచ్చుకున్నాడట. అయితే ప్రైజ్ మనీ 50 లక్షలు అయితే కటింగ్స్ పోను విన్నర్ కి కూడా దాదాపుగా ఇంతే మొత్తంలో చేతికి అందుతుంది అని అందరూ చర్చించుకుంటున్నారు.