మైండ్ బ్లోయింగ్ ధరకు పుష్ప 2 ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై నెలకొన్న బజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.తెలంగాణలో ఎలాగూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు లభిస్తాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా కోసం ఎంతమేర టికెట్ రేట్ల పెంపు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఏపీలో సింగిల్ స్క్రీన్ సాధారణ టికెట్ రేట్లు రూ.150-200 మధ్య ఉంటాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా ఈ రేటును రూ.300 గా పెంచాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎలాగూ బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు అనుమతి లభిస్తుంది. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుకు కూడా అనుమతి లభిస్తే.. పుష్ప-2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇదిలావుండగా పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడు.. అల్లు అర్జున్ పుష్ప టు మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఏ మూవీ అయినా రిలీజ్ అయిన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కొన్ని సినిమాలయితే.. కేవలం 10 నుండి 15 రోజులలో విడుదల అవుతాయి. కానీ పుష్పటు భారీ బడ్జెట్ మూవీ. 

ఒకవేళ హిట్ టాక్ అందుకుంటే.. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పాడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుందని, అటు మూవీ మేకర్స్ ఇటు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఓటిటి విషయానికి వస్తే .. పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం.. ఓటీటీ ప్లాట్ఫామ్స్ గట్టిగానే పోటీపడ్డాయట. ఈ పోటీలో అమెజాన్ చివరి వరకు పోటీపడిన నెట్ ఫ్లిక్స్ ఓటిటి రైట్స్ ను దక్కించుకుందట. ఇండస్ట్రీ ఇన్పుట్స్ ప్రకారం పుష్ప 2 ఓటిటీ రైట్స్ ను రూ. 275 కోట్లకు నెట్ ఫిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో పుష్ప 1 మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ కేవలం 30 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఓటిటీ రైట్స్ ను రికార్డ్ స్థాయిలో 175 కోట్లకు కొనుగోలు చేసింది ప్రస్తుతం పుష్ప 2 ఓటిటీరికార్డ్స్ గత రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పాలి.ఇదిలావుండగా నార్త్.. సౌత్.. అనే తేడా లేకుండా ప్రమోషన్ ఈవెంట్ లో దుమ్మురేపుతున్నారు బన్నీఫ్యాన్స్ . ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్ పెట్టిన లెక్కలేనంతగా అల్లు అర్జున్ ఫ్యాన్ ఈవెంట్ కు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, ఐటెం సాంగ్ మూవీపై అంచనాల్ని పెంచేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: