కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే కంగువ. మరి చాలా పెద్ద హిట్ అవుతుంది అని భారీ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలు మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు థియేటర్స్ లో దాదాపు కనుమరుగు కూడా అయ్యిపోయింది.దీంతో దాదాపు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే బడ్జెట్‌లో సగం కూడా రాబట్టనట్లు తెలుస్తుండగా ప్రజెంట్ మరో షాకింగ్ ఇష్యూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక నెక్స్ట్ ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ డిసెంబర్ 12 లేదా 13 నుంచే వచ్చేస్తుంది అని ఇపుడు బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ వారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగాఅమెజాన్ ప్రైమ్‌కు మరో బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వనున్న క్రమంలో ఇప్పుడు ఆన్ లైన్‌లో కంగువా హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ లీక్ అయింది. దీంతో డిజాస్టర్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు హెచ్ డీ ప్రింట్ కూడా లీక్ కావడంతో ఓటీటీ లో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.