శ్రీలీల జీవితాశయం ఇదేనా.. పెళ్లి విషయంలో ఆమె ఇలా చేయబోతున్నారా?
అయితే శ్రీలీల డిసెంబర్ నెలలో పుష్ప ది రూల్ తో పాటు రాబిన్ హుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలకు మధ్య 20 రోజుల గ్యాప్ ఉంది. భవిష్యత్తులో డెర్మటాలజిస్ట్ కావాలని తాను ఫీలవుతున్నానని శ్రీలీల చెబుతున్నారు. తన జీవితాశయం హాస్పిటల్ స్థాపించడం అని ఆమె చెప్పుకొచ్చారు. బాల్యం నుంచి చదువుకోవడం, డ్యాన్స్ ప్రాక్టీస్ పై మాత్రమే దృష్టి పెట్టానని ఆమె కామెంట్లు చేశారు.
పెద్దైన తర్వాత సినిమాల్లోకి రావడం వల్ల చదువు, డాన్స్ కు సినిమాలు అదనంగా మారాయని శ్రీలీల చెబుతున్నారు. నా పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ అని ఆమె చెప్పుకొచ్చారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ లేదని శ్రీలీల తేల్చి చెప్పేశారు. త్వరలో తనను సింగర్ గా చెఫ్ గా కూడా చూస్తారని ఆమె పేర్కొన్నారు. ఇంట్లో అమెరికన్ రుచులు సైతం వండుతానని శ్రీలీల పేర్కొన్నారు.
శ్రీలీలకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఆమె కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే శ్రీలీలకు తిరుగుండదని చెప్పవచ్చు. శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.