75 కేజీల వ్యక్తి నాపై పడుకుని అలాంటి పని చేసిన భరించాల్సిందే .. మంగళవారం నటి హాట్ కామెంట్స్..!

Amruth kumar
సినిమాల్లో కథ డిమాండ్ చేసిన మేరకు హీరో , హీరోయిన్లు ఇతర నటుల మధ్య బెడ్రూం సీన్లు , లిప్ లాక్ వంటి సన్నివేశాలు తెరకెక్కిస్తూ ఉంటారు .. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు .. వీటిని చూసే కొందరు ఇబ్బంది పడతారు అలాంటిది నటించే వారికి ఇంకెలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇబ్బందిపడిన ఎవరు ఏమనుకున్నా బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిందే . ఈ క్రమంలో బెడ్ రూమ్ స‌న్నివేశాలపై సంచల వ్యాఖ్యలు చేశారు మంగళవారం మూవీ ఫేమ్  దివ్య పిళ్లై .యూఏఈ లో స్థిరపడిన మలయాళీ కుటుంబంలో జన్మించిన దివ్య పిళ్లై .. సినిమాల్లో కి రావడానికి ముందు ఎయిర్ లైన్స్ లో పనిచేశారు .. 2015లో అయల్ జనల్లా అనే మలయాళీ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ..

ఇక ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న దివ్య .. ఆ తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించి బిజీ అయ్యారు .. నవీన్ చంద్ర హీరోగా వచ్చిన తగ్గేదేలే సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన దివ్య కెరీర్ను మంగళవారం సినిమా ఊహించని మలుపు తిప్పింది. ఆర్ఎక్స్ 100 సినిమాను తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ కు మించి మంచి మార్కులు కొట్టేశారు దివ్య .. జమీందార్ బార్య‌ రాజేశ్వరి దేవిగా అందంగా పద్ధతిగా గ్రామ ప్రజలకు పెద్దగా చేతులెత్తి ముక్కించుకుంటుంది .. చివరికి క్లైమాక్స్లో ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది .. తన అక్రమ సంబంధం బయటపడకుండా హీరోయిన్ ని చంపేసి తన విల‌నిజాన్ని  బయటపెట్టి భయపెట్టింది దివ్య పిళ్లై.

 మంగళవారం మూవీ దివ్య కెరియర్ను ఊహించిన రేంజ్ లో మార్చేసింది .. ఈమెకు తెలుగు , తమిళ , మలయాళీ భాషలో వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి .  ఇదే క్రమంలో రీసెంట్ గా దివ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. సెట్స్‌లో అందరి ముందు శృంగార సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదని.. 75 కేజీల బరువు ఉన్న వ్యక్తి మనపై పడుకున్నా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నటించాలని దివ్య చెప్పారు. ఎంత ఇబ్బంది పడినా ఓపిగ్గా భరించాల్సిందే తప్పించి ముఖంలో ఆ ఫీలింగ్‌ను అస్సలు చూపించకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దివ్య పిళ్లై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: