నిర్మాతల తాటతీస్తున్న బాలయ్య .. రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడుగా..!

Amruth kumar
ఒకప్పుడు నట‌సింహం బాలకృష్ణతో సినిమా అంటే లో బడ్జెట్ తో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు .. డబ్బులు కోసం బాలయ్య సినిమా చేయడు అనే పేరు కూడా ఉండేది .. అయితే ఇప్పుడు బాలయ్య అంతా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచిస్తున్నట్టు టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తుంది .. కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండే బాలయ్య ఆలోచన ఇప్పుడు పూర్తిగా మార్పులు వచ్చాయి .. అఖండ సినిమా సూపర్ హిట్ అవటం ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లో  రాబట్టడం. అలా ఆ సినిమా నుంచి చాలా పక్కాగా ముందుకు వెళుతున్నాడు .. అలానే నిర్మాతలకు తన సినిమాలతో కాసుల వర్షం కురిపించడంతో పాటు భారీగా రెమ్యునరేషన్ తీసుకోవ‌టం మొదలు పెట్టాడు ..

అఖండ సినిమాకు 25 కోట్లకు పైగా బాలయ్య పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి .. అయితే అంతకంటే ఎక్కువ అనే టాక్ కూడా ఉంది . తర్వాత వీర సింహారెడ్డి కూడా కలెక్షన్ల వర్షం కురిపించడంతో బాలయ్యకు లాభాల్లో వాటా ఇచ్చారట మేకర్స్ .. ఇక తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ అయింది .. ఈ సినిమాకు కూడా బాలయ్య 30 కోట్లకు పైగానే తీసుకున్నారని అంటున్నారు . ఇక ఇప్పుడు వచ్చి అఖండ సిక్వెల్ కు, డాకు మహారాజుకు 50 కోట్లకు పైగా డిమాండ్ చేశారని అంటున్నారు .. కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలయ్య వెనక్కు తగ్గటం లేదు.  దీంతో స్టార్ హీరోలుతో చేసే సినిమాలకు బడ్జెట్ ఎంత పెడుతున్నారో బాలయ్య సినిమాలకు కూడా అంతే పెడుతున్నారు నిర్మాతలు .. ఇప్పుడు అఖండ 2 కు లాభాల్లో కూడా బాలయ్య వాటా డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు ..

ఇలా ఒక పక్క సినిమాలే కాకుండా ఆహాలో బాలయ్య  అన్ స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. ఇక ఈ షో తో ఆహా కు భారీ లాభాలు వచ్చే పడ్డాయి .. ఈ షో కోసం ముందు బాలయ్య రెమ్యూనరేషన్ తీసుకోలేదు .. ఆ డబ్బులు మొత్తం హాస్పిటల్కు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి .. ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ కు కూడా బాలయ్య ప్రచారకర్తగా ఉన్నాడు. పలు బ్రాండ్ లకు బాలయ్య ప్రమోషన్స్ చేస్తున్నాడు. గతంలో బాలయ్య లెక్క కాస్త డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు మొత్తం లెక్కలు మారడంతో బాలయ్య కూడా రూటు మార్చి గట్టిగా డిమాండ్ చేయడంతో నిర్మాతల వెన్నులో వణుకు మొదలయింది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: