అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాబాయ్ చీఫ్ గెస్ట్ .. గేమ్ ఛేంజర్ నుంచి ఊహించని గిఫ్ట్..!

Amruth kumar
ఇక సంక్రాంతి కి వచ్చే సినిమాల్లో ప్రమోషన్లు జోరు గట్టి గా చూపిస్తున్నారు గేమ్ ఛేంజర్ టీం .. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఈవెంట్ అనౌన్స్ చేశారు .. ఇటు పాటలు రిలీజ్ లోను ఎంతో ఫాస్ట్ గా ఉన్నారు .. ఇక అయితే ఎప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ చేస్తారు అంటూ అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు . జనవరి లో రిలీజ్ అయ్యే గేమ్ ఛేంజర్ పై ఇప్పటి నుంచే అంచనాలు సూపర్ గా ఉన్నాయి . ఇక వాటి కి తగ్గట్టు గానే ఈవెంట్స్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు .

ఇక మన తెలుగులో ఫ్రీ రిలీజ్  ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లో చేయడానికి ఫిక్స్ అయ్యారట . రాజమండ్రి వేదిక గా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే కాకినాడ గాని ఏలూరు గానీ  వెన్యూ కన్ఫర్మ్ అవుతుంది . ఇక ఆంధ్రా లో ఆ రేంజ్ లో జరిగే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజెర్‌ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని మాట మెగా ఫ్యాన్స్ లో డబల్ కిక్కి ఇస్తుంది . అబ్బాయి కోసం బాబాయ్ తరలి వస్తున్నారని టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది .

గేమ్ ఛేంజర్ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులే వచ్చాయి . కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. శంకర్‌ కోసం తమన్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది .. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దగ్గర్నుంచి వస్తున్న ఈ సోలో మూవీ జనవరి 10 న ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తి  నెలకొంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: