చిరంజీవి కెరీర్ లోనే భారీ షాక్ ఇచ్చిన సినిమాలు ఏమిటో తెలుసా .. మెగాస్టార్‌కు గట్టి జలక్ ఇచ్చాయిగా..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎటు వంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ కే  శిఖరంగా నిలిచాడు చిరంజీవి.. ఆయన తర్వాత ఈ మెగా కుటుంబం నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి వరుణ్ తేజ్ వరకు చిత్ర పరిశ్రమలో హీరోలుగా  కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి సినీ కెరీర్ లో కూడా చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి .. చిరంజీవి తన నట జీవితంలో ఇప్పటి వరకు 150కు పైగా సినిమాల్లో నటించారు .. అందులో చాలా సినిమాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని రిలీజ్ అయ్యాయి .. కానీ కొన్ని సినిమాలు మాత్రం అడ్డంకులు దాటలేక, మరికొన్ని సినిమాలు అసలు ప్రారంభం కాక, మరికొన్ని సినిమాలు షూటింగ్ మొదలోనే అవి అక్కడే ఆగిపోయాయి. ఈ విధంగా చిరంజీవి కెరీర్ లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

భూలోక వీరుడు: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగేతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ భారీ జానపదం సినిమాగా చిరంజీవిని హీరోగా పెట్టి తీయాలనుకున్నారు. కానీ ఈ సినిమా కథ‌ అనుకున్నంత చాలా పర్ఫెక్ట్ గా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు. వినాలని ఉంది: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు .. ఈ సినిమాలో చిరుకు జంటగా ఊర్మిళా , టబులను హీరోయిన్లుగా ఎంచుకున్నారు . ఈ ఇద్దరితో రెండు పాటలు షూటింగ్ కూడా పూర్తి చేశారు .. అలానే కొంత భాగం సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు .. కానీ ఈ సినిమా మధ్యలో అద్దాంతరంగా ఆగిపోయింది. అబూ బాగాథ్‌ గజదొంగ: ప్రస్తుతం పాన్ ఇండియా పాన్ ఓల్డ్ సినిమా అంటున్నారు కానీ .. చిరంజీవి ఎప్పుడో ఇలాంటి సినిమాలను మొదలు పెట్టాడు.. ఆ తరహా సినిమానే అబూ బాగాథ్‌ గజదొంగ .. సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా సౌత్ భాషలతో పాటు , హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని తెరకెక్కించాలని భావించారు .. ఈ సినిమా కూడా కొన్ని రోజులకు మధ్యలోనే ఆగిపోయింది.

వజ్రాల దొంగ: చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో  వజ్రాల దొంగ అనే సినిమాని కోదండా రామిరెడ్డి దర్శకత్వంలో చేయాలని భావించారు.. సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలవగా మధ్యలో ఈ సినిమా ఆగిపోయింది. చిరంజీవి ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా:   కామెడీ సినిమాల దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి కూడా చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావించారు .. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆదిత్య సినిమా: ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు ఆదిత్య .. ఈయన కూడా చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావించరు.. చిరు కోసం ఓ కథను కూడా సిద్ధం చేశారు .. కానీ ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఆటో జానీ: చిరంజీవి రాజకీయాలనుంచి సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చే సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయబోతున్నాడు అంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.. ఈ సినిమాపై చాలా రోజులు చర్చలు కూడా జరిగాయి.. ఆ సినిమా వర్కౌట్ అవలేదు.. ఈ విధంగా చిరంజీవి తన కెరియర్ లోచాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: