టీమిండియా క్రికెటర్‌ తో మెగా హీరోయిన్‌ ఎఫైర్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫీదా అయ్యారు. ఉప్పెన సినిమా అనంతరం కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలలో నటించింది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది.

కృతి శెట్టి నటించిన సినిమాలలో బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మాత్రమే మంచి సక్సెస్ ఇచ్చాయని చెప్పాలి. అనంతరం కృతి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి. దీంతో టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ  కృతికి తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్గా చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ  కృతి శెట్టి టీమిండియా స్టార్ క్రికెటర్ తో ఎఫైర్ కొనసాగిస్తుందంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

ఆ క్రికెటర్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కి కూడా వెళ్తున్నారట. మరి ఆ క్రికెటర్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియలేదు. ఈ విషయంపై కృతి శెట్టి స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు. ఈ వార్తలో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ  కృతి శెట్టికి సంబంధించిన ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: