డైరెక్టర్ల ఎంపికలో చిరంజీవి తప్పటడుగులు.. తారక్ చేసిన తప్పే చేస్తున్నారా?

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన చిరంజీవి తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. అయితే డైరెక్టర్ల ఎంపికలో చిరంజీవి తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు హిట్లు అందుకున్న యంగ్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా ఓటేస్తుండటం గమనార్హం.
 
ఒకప్పుడు తారక్ సైతం సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇచ్చేవారు. అయితే అలా ఛాన్స్ ఇచ్చిన సమయంలో తారక్ కు భారీ హిట్ల కంటే భారీ ఫ్లాపులే ఎక్కువగా దక్కాయని చెప్పవచ్చు. చిరంజీవి సైతం గత కొంతకాలంగా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెలకు ఛాన్స్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒకే ఒక్క సినిమా దసరా అనే సంగతి తెలిసిందే. కనీసం రెండో సినిమా రిలీజ్ అయ్యే వరకైనా చిరంజీవి ఆగి ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిక్ భవిష్యత్తు సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. కచ్చితంగా సక్సెస్ ఇచ్చే పాన్ ఇండియా డైరెక్టర్లకు చిరంజీవి ఓటేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చిరంజీవి భవిష్యత్తు సినిమాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి భవిష్యత్తు సినిమాలు సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చిరంజీవి క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలలో చిరంజీవి స్థాయిలో ఏ హీరో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: