అక్కినేని అమల ఈ మధ్యకాలంలో ట్రోల్ కి గురైన సంగతి మనకు తెలిసిందే.ఎందుకంటే అమల నాగచైతన్య పై సవతి ప్రేమని చూపిస్తుంది తప్ప కన్న ప్రేమని చూపించదని, ఈ విషయంలో పూర్తిగా అర్థమయిపోయింది అంటూ జనాలు ట్రోల్ చేశారు.అయితే దానికి ప్రధాన కారణం నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఆగస్టులో జరిగిన సమయంలో అమల వారికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయలేదు. కానీ తన సొంత కొడుకు అఖిల్ జైనబ్ ల ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కొడుకు కోడలు కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో పోస్ట్ చేసింది.దీంతో అమల నెగెటివిటీ ఎదుర్కొంది. అయితే ఈ విషయం పక్కన పెడితే..మరికొన్ని గంటల్లో భార్యాభర్తలుగా మారబోతున్న అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల్లకు సంబంధించి ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి.
మంగళ స్నానాలు పూర్తయ్యాయి. అలాగే శోభితను పెళ్లికూతురు చేసిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లికి మరికొన్ని గంటలు ఉన్న వేళ తాజాగా అక్కినేని అమల కొత్త కోడలు పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అమల ఓ ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమలని ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూవర్ మీ ఇంటికి రాబోయే కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే ప్రశ్న ఎదురవగా..శోభిత చాలా మంచిది.అలాగే మెచ్యూర్డ్ పర్సన్..వెరీ టాలెంటెడ్ కూడా.. ఆ అమ్మాయికి నేను సలహాలు సూచనలు ఇవ్వనవసరం లేదు.
కచ్చితంగా శోభిత ధూళిపాళ్ల ఒక మంచి భార్య అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ కొత్త జంట బాగుండాలని దీవించాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లపై అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే అమల మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో అమల ఇండైరెక్టుగా సమంతకి కౌంటర్ ఇచ్చిందని, శోభిత మెచ్యూర్డ్..టాలెంటెడ్.. అని అమల చెప్పింది అంటే అంతకు ముందున్న సమంత మెచ్యూర్డ్ పర్సన్ కాదా..ఆమెకి అంత సీన్ లేదా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు